–
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచిన మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొనియాడారు. శనివారం హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోసం గండిపల్లె, గౌరవెల్లి ప్రాజెక్టు కోసం బొమ్మ వెంకన్న, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశాడన్నారు. రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద వర్గాలకు అండగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, మండల అధ్యక్షులు బంక చందు, భీమదేవరపల్లి మండల అధ్యక్షులుచిట్టంపల్లి ఐలయ్య, చల్ల మల్లారెడ్డి ,బీసీ సెల్ పోతుగంటి బాలయ్య, ఎస్టీ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ కన్వీనర్ వెన్నరాజు తదితరులు పాల్గొన్నారు.