
– ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్
నవతెలంగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రాజు యువ వికాసం స్కీం తేదీని పొడిగించాలని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని ఎన్సిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏం సిపిఐయు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం బాగానే ఉంది కానీ తాసిల్దార్ కార్యాలయాలలో కుల ఆదాయ ధ్రువపత్రాలు రావడానికి సైట్ ఇబ్బంది వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ యొక్క పథకానికి అర్హులు అయ్యే విధంగా ప్రభుత్వం చూడలని ఇదే అదునుగా తీసుకొని కొంతమంది నాయకులు ప్రజల దగ్గర డబ్బులు లాగాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నారు. ప్రజలు మోసపోకుండా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోనీ తాసిల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ పత్రాలు తొందరగా వచ్చే విధంగా చేయాలన్నారు.