ఘనంగా రాజీవ్‌ గాంధీ వర్ధంతి

నవతెలంగాణ-గణపురం
మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ 32వ వర్ధంతి వేడుకలు గణపురం మండల పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైస్‌ ఎంపీపీ విడిదినేని అశోక్‌ పాల్గొని మాట్లాడుతూ దేశంలో కంప్యూటర్‌ యుగానికి ఆద్యం పోసింది రాజీవ్‌ గాంధీ అన్నారు. 1989లో ఓటు హక్కు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించి యువతకు ఓటు హక్కు కల్పిం చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దేశంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ తీసుకువచ్చి గ్రామా లకు ఒక రూపు తీసుకువచ్చిన మహానుభావుడు, అన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, అయ్యాడ న్నారు. దేశం కోసం ప్రాణం వదిలారు అంటే అది ఒక గాంధీ కుటుంబం మాత్రమే అన్నారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షు లు వెంపటి భువనసుందర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మామిళ్ల మల్లికార్జున్‌ గౌడ్‌, ఇమ్మడి వెంకటేశ్వర్లు గణపురం టౌన్‌ ప్రెసిడెంట్‌ ఓరుగంటి కృష్ణ, మండల యువజన కాంగ్రెస్‌ నాయకులు పోశాల మహేష్‌ గౌడ్‌, బాల్య కుమార్‌ నేరెళ్ల రాజు, వార్డు సభ్యులు ఓధాకర్‌, గణపురం యూత్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ దూడపాక పున్నం యువ నాయకులు కార్తీక్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మహాదేవపూర్‌ :ఏఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి మంథని శాసన సభ్యులు దుద్దిల్లశ్రీధర్‌ బాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు అక్బర్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో మహదేవపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం రాజీవ్‌ గాంధీ 32 వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మండల అధ్యక్షుడు అక్బర్‌ ఖాన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోట రాజబాబు, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు అస్రార్‌ ఖురైషి యూత్‌ నాయకులు ఏజాస్‌ ప్రణరు, రాజమౌళి, శంకర్‌ నయీమ్‌, తదితరులు పాల్గొన్నారు
మల్హర్‌రావు : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివద్ధి చేసిన ధ్రువ తార అసమాన సమా జంగా ఉన్న భారతదేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహౌ న్నత వ్యక్తి అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి గా ఉండాలని సిడాట్‌ కార్యక్రమం ద్వారా టెలిఫోన్‌ను గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉపయోగించే విధంగా కృషి చేసిన వ్యక్తన్నారు. మన దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిష్టించి రికార్డు నెలకొల్పారన్నారు. ప్రజలకు మేలు చేయాలని తపన ఉన్నా కుటుంబం రాజీవ్‌ గాంధీ కుటుంబం అన్నారు. ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాలన్నా రు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యార్తలు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ : భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి భారతదేశాన్ని అభివద్ధి బాటలో నడిపించిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కమలాపురం రమేష్‌ అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌ మండల కేంద్రంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్‌ గాంధీ సమసమాజ స్థాపన కోసం చేసిన కషి ఎప్పటికి మరువలేనిదని అన్నారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్‌ గాంధీ కృషి చేశారని అన్నారు. దేశం కోసం ప్రాణా లు అర్పించారని కొనియాడారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం నాయకులు పర్వతగిరి రాజు,జిల్లా ఓబిసి కోఆర్డినేటర్‌ చిమ్మని దేవరాజ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పరికరాల వాసు, కార్యదర్శి వెల్దే వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బిక్షపతి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మైపాల్‌ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బయ్య కుమారస్వామి, అలువాల రవి మ త్స్యశాఖ చైర్మన్‌ బయ్య తిరుపతి,మండల ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్‌, పాక్స్‌ డైరెక్టర్స్‌ శీను, రాజేందర్‌, వార్డ్‌మెం బర్‌ రవియాదవ్‌, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. మండల అధ్యక్షులు వేమునురి ప్రభాకర్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోత్‌ సుగుణ, డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి ,మహిళ కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్య ,డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న , మంథని నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్‌ కారెంగాల తిరుపతి గౌడ్‌, పార్టీ మండల ఉపాధ్యక్షులు చీమల వెంకటస్వామి ,సర్పంచ్‌ రఘురాం నాయక్‌ ,ఎంపీటీసీ రవీందర్‌ రావు, మాజీ సర్పంచ్‌ చీర్ల తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
మహాముత్తారం : మహాముత్తారం మండల కేంద్రంలో రాజీవ్‌ గాంధీ32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల అధ్యక్షులు పక్కన సడవాలి ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారు చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ, యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విభాగాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార భారతదేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహౌన్నత వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమా లవేసి నివాళులర్పించారు. మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య , పుల్ల చందు తదితరులు పాల్గొన్నారు.

Spread the love