పత్రికారంగంలో రామోజీరావుది చెరగని ముద్ర

పత్రికారంగంలో రామోజీరావుది చెరగని ముద్ర– పి ప్రభాకర్‌, సీజీఎం నవతెలంగాణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పత్రికారంగంలో అయనది చెరగని ముద్ర. తెలుగు సమాజానికి ఆయన సేవలు విలువైనవి.ఈటీవీ ద్వారా టెలివిజన్‌ రంగంలోనూ ఆయన అద్బుతంగా రాణించారు’ అని అన్నారు. శనివారం ఆయన రామోజీ పీలిమ్‌ సిటీలో రామోజీ భౌతికగాయం వద్ద పూల మాలలు వేసి నివాలుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆయన పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నా…ప్రవృత్తిగా చిత్రసీమకు సైతం సేవలందించారని గుర్తు చేశారు. రామోజీ పిల్మీం సిటీ ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంప నలుమూలలకు విస్తరించిన వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love