నవతెలంగాణ – వేములవాడ
ధరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి అని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడలోని నంది కమల్ వద్దగల నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిజం కాలం నుండి పోరాటం చేసిన గొప్ప వీరవంత రంగవల్లి అని అన్నారు.రంగవల్లి విజ్ఞాన కేంద్రంను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అని వెల్లడించారు.దొరల పాలనకి వ్యతిరేఖంగా పోరాటం చేశారు,రంగవల్లి స్ఫూర్తి దాయకం అని అన్నారు.బూర్జవ, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటలు చేశారని,సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ, అదివాసి బిడ్డలకు అండగా నిలబడ్డారు అని కొనియాడారు. రంగవల్లి విద్యార్థి దశలోనే విద్యార్థి ఉద్యమాలలో పని చేశారు. ప్రగతి శీల సంఘంలో, విప్లవ పార్టీలో కొనసాగుతూ పేద ప్రజల కోసం అనేక పోరాటం చేసి ప్రాణాలర్పించిన వీరవనిత అని అన్నారు. అనంతరం అరుణోదయ సంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ నిజం కాలం నుండి పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పనిచేస్తూ సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వీరనారి అని కొనియాడారు. భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. రంగవల్లి జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం కావాలని ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అని తెలిపారు. పార్టీలు వేరైనా భావాలు వేరైనా ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప స్ఫూర్తి మూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థకు మాధవి, సిరిసిల్ల నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, పలువురు రచయితలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.