సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
నవతెలంగాణ – భూపాలపల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 118 వ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూస్ బ్రాంచ్ కార్యదర్శి మోటపలు కుల రమేష్ లు రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన యోధుడు రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు నాయకులంతా కృషి చేయాలని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి అధిక మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని కోరారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల కోసం పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్తుకు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు కొరిమి సుగుణ, క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతాంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు గురుజ పెళ్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, ఏం విజేందర్, కాంట్రాక్టు కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, తాళ్ల పోశం, దోర్నాల తిరుపతి, పొన్నగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
రావి నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగించాలి..
- Advertisement -
- Advertisement -



