రాణించిన రవితేజ

Ravi Teja excelled– బిహార్‌పై హైదరాబాద్‌ గెలుపు
రాజ్‌కోట్‌ : పేసర్‌ రవితేజ (4/26) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరవటంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో బిహార్‌పై హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బిహార్‌ 20 ఓవర్లలో 118/9 పరుగులే చేసింది. ఛేదనలో రోహిత్‌ రాయుడు (56 నాటౌట్‌, 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (51 నాటౌట్‌, 31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో చెలరేగటంతో 12.3 ఓవర్లలోనే హైదరాబాద్‌ 119/1 పరుగులు చేసింది. మరో 45 బంతులు ఉండగానే ఘన విజయం సాధించింది. రవితేజ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. గ్రూప్‌-ఏలో హైదరాబాద్‌కు నాలుగు మ్యాచుల్లో ఇది రెండో విజయం.

Spread the love