Wednesday, June 3, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం

- Advertisement -


కోల్‌‌కతా : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయా పార్టీలు ఢిల్లీలో సమావేశమవుతాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అయితే ప్రదర్శనల్లో పాల్గొనవద్దని టీఎంసీ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తమ నిరసన మాత్రం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. పునరావాసం చూపకుండా వీధి వ్యాపారాలను తొలగించడం అన్యాయమని అన్నారు. ఈ పద్ధతిని టీఎంసీ ప్రభుత్వం ఎప్పుడూ అవలంబించలేదని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తాను కార్యకర్తలకు మద్దతుగా వారితో కలిసి పోరాడతానని వెల్లడించారు. తన జీవితంలో ఎవరికైతే తాను అండగా నిలిచానో వారే ఇప్పుడు ఒక ద్రోహితో చేతులు కలపడం విచారంగా ఉందని సీఎం సువేందు అధికారిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -