Wednesday, June 3, 2026
E-PAPER
Homeబీజినెస్ఏఐతో మానవాళికి తీవ్ర ముప్పు..

ఏఐతో మానవాళికి తీవ్ర ముప్పు..

- Advertisement -


 గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్‌ చీఫ్ హెచ్చరిక
వాషింగ్టన్‌ :
కృత్రిమ మేధ (ఎఐ) భవిష్యత్తులో ఊహించని మార్పులకు దారితీయనుందని గూగుల్ ఎక్స్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మొ గావ్‌డాట్ తెలిపారు. ప్రస్తుతం చూస్తున్న చాట్‌జిపిటి, జెమిని వంటి టూల్స్ కేవలం ఆరంభం మాత్రమేనని.. రాబోయే మూడేళ్లలోనే ఎఐ అత్యంత శక్తిమంతంగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవడమే కాకుండా.. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని గావ్‌‌డాట్‌ ‌ఓ పాడ్‌‌కాస్ట్‌‌లో హెచ్చరించారు. తద్వారా సమాజంలో పెను మార్పులు రానున్నాయని పేర్కొన్నారు.
అయితే ఎఐ దానంతట అది ప్రమాదకరం కాదని.. కంపెనీలు, ప్రభుత్వాలు దానిని ఉపయోగించే విధానంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గావ్‌డాట్ వివరించారు. ప్రస్తుతం ప్రయోగశాలల్లో ఎఐ సిస్టమ్‌లు సొంతంగా కోడింగ్‌ను మెరుగుపరుచుకుంటూ.. సరికొత్త వెర్షన్లను వేగంగా సృష్టిస్తున్నాయని తెలిపారు. ఎఐ అసలు సామర్థ్యానికి దానిపై ప్రజలకు ఉన్న అవగాహనకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని.. అందుకే రాబోయే విప్లవాత్మక మార్పుల తీవ్రతను చాలామంది గుర్తించలేకపోతున్నారని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -