రోడ్లపై నేలవాలిన చెట్ల తొలగింపు

నవతెలంగాణ – శాయంపేట
పక్క ఫోటోలో శనివారం రాత్రి కురిసిన అకాల గాలి దుమారం వర్షాలకు కూలీన చెట్లను కట్టర్‌తో కటింగ్‌ చేస్తున్న వ్యక్తి కూలి అనుకుంటే పొరపడినట్లే.
సాక్షాత్తు గ్రామ సర్పంచ్‌ తాటికొండ మౌనిక భర్త రవి కిరణ్‌. శని వారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు, పెద్ద పెద్ద భారీ వక్షాలు, 8 విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. దీంతో స్పందించిన సర్పంచ్‌ భర్త రవికిరణ్‌ ఆదివారం స్వయంగా రంగంలోకి దిగి యువకుల సహాయంతో కట్టర్‌ మిషన్‌ కిరాయికి తెచ్చుకొని రోడ్డుపై నేల వాలిన చెట్లను కటింగ్‌ చేస్తూ క్లియరెన్స్‌ చేశారు. సర్పం చ్‌ భర్త హౌదా ఉన్నప్పటికీ స్వయంగా రంగంలోకి దిగి పనులు చేస్తుండడంతో గ్రామస్తులు రవికిరణ్‌ను అభినం దించారు. విద్యుత్‌ అధికారులకు విషయం తెలియజేసి విద్యుత్‌ క్రమబద్ధీకరణ పనులు చేపడుతున్నారు.

Spread the love