Saturday, May 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ప్ చేయండి..ప్ర‌ధానికి క‌విత లేఖ‌

బండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ప్ చేయండి..ప్ర‌ధానికి క‌విత లేఖ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కె. కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు.

“కేంద్ర మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన చట్టపరమైన నైతికత, ప్రజా విశ్వాసం వంటి కీలక అంశాలను మీ దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను” అని కవిత ప్రధానిని ఉద్దేశించి పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలపై అధికారం కలిగిన హోం శాఖ వంటి అత్యంత కీలకమైన శాఖలో బండి సంజయ్ కొనసాగడం వల్ల కేసు దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, డిసెంబర్ 31, 2025న మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఘటన జరిగినట్లు ఆరోపణలున్నాయి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం …. జూన్ 2025 నుంచి భగీరథ్, బాలికను గ్రూమింగ్ చేసి, మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. మొదట ఐపీసీ సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో సెక్షన్లు 11/12 కింద కేసు నమోదై, తర్వాత బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ అసాల్ట్ (POCSO సెక్షన్ 5(l) r/w 6) కింద అప్‌గ్రేడ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -