Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్టిన బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం

పుట్టిన బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
జన్మనిచ్చిన తల్లి పాలు బిడ్డకు అమృతం వంటివని ఐసీడీఎస్ సూపర్‌ వైజర్ శ్రీలేఖ అన్నారు. గురువారం మండలంలో వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులకు అవగాహన కల్పించారు. అనంతరం సూపర్‌ వైజర్ మాట్లాడుతూ.. శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లి బిడ్డకు ముర్రు పాలు ఇవ్వడం ఎంతో అవసరమని తెలిపారు. ముర్రు పాలు ఇవ్వడం వల్ల చిన్నారులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బిడ్డకు తల్లిపాలు అందిస్తూ అదనంగా ఆరు నెలల పాటు పోషక ఆహారం అందించాలని సూచించారు. తల్లిపాలపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని కోరారు. ప్రతి శిశు వుకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు అందించడమే తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి కవి త స్వామి గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, వైద్యాధికారి డాక్టర్ సుభాషిణి, ఏఎన్‌ఎం లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, స్వప్న, వీణ, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, యాదమ్మ, వినోద, గర్భిణీ లు, బాలింతలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -