హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో.. 26, 27 తేదీలలో రెన్యూఎక్స్ ఎక్స్‌పో

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లో ప్రముఖ బీ2బీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఆధ్వర్యంలో ఈనెల‌ 26, 27వ తేదీలలో అతిపెద్ద ఎక్స్‌పో ‘రెన్యూఎక్స్ 2024’ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు ఇన్‌ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ (భారత్) యోగేష్ ముద్రాస్ తెలిపారు. ‌దక్షిణాదిలో పునరుత్పాదక ఇంధనం‌ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కోసం ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని, ఇది ఎనిమిదో ఎడిషన్‌ అని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పో ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు, ఫెసిలిటీ మేనేజర్‌లు, ఎనర్జీ కన్సల్టెంట్‌లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్‌లు, ఈపీసీలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్‌లు, సిస్టమ్ ఇన్‌స్టాలర్‌లు, ఇంటిగ్రేటర్లు, రెగ్యులేటరీ బాడీలు, మునిసిపాలిటీలు, స్థానిక అధికారులు తదితర విభిన్న ప్రేక్షకులను ఆకర్షిస్తుందని తెలిపారు. ‘రెన్యూఎక్స్ 2024’ వివిధ అవకాశాలు, వ్యాపార సంబంధాలకు ఒక గేట్‌వే అన్నారు. గత ఏడాది ఈవెంట్ సక్సెస్ ను బట్టి.. ఈ ఏడాది 5500 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. 150 పైగా దేశ, విదేశీ ఎగ్జిబిటర్‌లు వస్తారన్నారు. చైనీస్ కంపెనీలు తమ ఇండియా ఆపరేషన్ టీమ్ ద్వారా హాజరవుతాయన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, వారీ ఎనర్జీస్, గోల్డి సోలార్, విక్రమ్ సోలార్, గౌతమ్ సోలార్, స్వెలెక్ట్ ఎనర్జీ, ఎమ్మెవీ సోలార్, జింకో సోలార్, రేజోన్ సోలార్, ఎస్ఎంఏ సోలార్, గ్రూ ఎనర్జీ, క్రెడెన్స్ సోలార్, పహల్ సోలార్, వంటి అగ్రశ్రేణి సంస్థలు కలవన్నారు. ఇవ్వో సోలార్, ఐకాన్ సోలార్, ఎంపీఎల్ గ్రూప్, లూమినస్ పవర్ టెక్నాలజీస్, మైక్రోటెక్ , లివ్‌గార్డ్ సోలార్, డియె ఇన్వర్టర్, వాలెయో ప్రొడక్ట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, ఇంపల్స్ గ్రీన్ ఎనర్జీ ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, ఇన్వర్టర్లు, ఛార్జ్ కంట్రోలర్లు, బ్యాటరీలు, సోలార్ వాటర్ హీటర్లు, కూలింగ్ సిస్టమ్‌లు, సోలార్ పంపులు, టెస్టింగ్, మానిటరింగ్ సిస్టమ్‌లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌లు, విండ్-సోలార్ హైబ్రిడ్ తదితర ఉత్పత్తులు, సేవలతో 180 బ్రాండ్లు విస్తృత శ్రేణి ప్రదర్శన ఉంటుందన్నారు. పవర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, ఈవీ, ఛార్జింగ్ ఇన్‌ఫ్రా, అసెంబ్లర్‌లు, ఈపీసీ ప్లేయర్‌లు కూడా ఉన్నాయన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి 45 శాతం కంటే తక్కువ కార్బన్ తీవ్రతను తగ్గించడం, 2070 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడం కోసం భారతదేశం నిబద్ధతతో ఉందన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణంలో కార్బన్ రహిత వృద్ధి ఆవశ్యకత ఎంతైనా అవసరమన్నారు.

Spread the love