Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి 

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
ప్రైవేటు పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని సోమవారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి, అనంతరం తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులుకు ఆ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. పాఠశాలలు పునః ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నందున ఆలస్యం చేయకుండా ఫీజు రాయితీ సర్కులర్ వెంటనే జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రఘుమయ్య,టి యు డబ్ల్యూ జే, ఐజేయు జిల్లా జాయింట్ సెక్రెటరీ కుక్కడపు ముత్యాలు గౌడ్,ఆయా పత్రికల జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -