
నాగార్జునసాగర్ జలాశయంలో ఇకపై రింగు అలివి వలలు నిషేదానికి తీర్మాణం చేసుకున్నామనిమత్స్యకారుల సాగర్ జలాశయం పరిసర ప్రాంతాల్లో చేపల వేట చేస్తున్న సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో నాగార్జునసాగర్ లో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రింగు అలివి వలలతో చేపల వేట కొనసాగించకూడదని సమీపంలో ఉన్న సంఘాల నాయకులు తీర్మానం చేశారు. ఆదివారం సాగర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కారే రమణ ఆధ్వర్యంలో పైలన్ కమ్యూనిటీ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాల్గొన్న అధ్యక్షులు రైట్ బ్యాంక్ కారే ముసలాయ కంబాలపల్లి నరేష్ పెద్దగట్టు మురళి వైజాగ్ కాలనీ బంగారి పాల్తూ తండ మురళి ఊరబావి తండా రవి హాజరయ్యారు. అనంతరం ఇకపై నాగార్జునసాగర్ జలాశయం పరిసర ప్రాంతాలలో రింగు అలివి వలలు నిషేధిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగానాగార్జునసాగర్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. రింగు వలలు తో చేపల వేట చేయడం వలన జలాశయం లో 40 అడుగుల లోతులో ఉన్న మత్స్య సంపదను ఒకేసారి ఖాళీ చేస్తుందని రింగు అలివి సముద్రంలోనే 60 రోజుల్లో చేపలు లేకుండా ఖాళీ చేసిందని అన్నారు. ఇకపై నాగార్జునసాగర్ జలాశయం పరిసర ప్రాంతాల్లో నిషేధం కొనసాగుతుందని అన్నారు. నేటి మత్స్యకార కుటుంబాలు జీవనం కొనసాగించాలనే ఈ రింగు వలలను నిషేధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కందాల తాతారావు డైరెక్టర్లు విజయ్ పుష్పాటి శివ యేసు సంఘం నాయకులు అప్పారావు నాగరాజు దేవుడు నూకరాజు బంగారి సత్య రావు అప్పారావు శ్రీను రమణ అప్పలరాజు కోదండరావు సత్యారావు మళ్లీ రాజు తదితరులు పాల్గొన్నారు.