చేపూర్ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ కార్యక్రమం

నవతెలంగాణ  – ఆర్మూర్

మండలంలోని చేపూర్  గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోచ్కర్  అనసూయ దేవి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించినారు. తన 39 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో ఎందరెందరు విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తములుగా ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనతగల ఉపాధ్యాయురాలి సేవలు అభినందిస్తూ ప్రశంసిస్తూ ఆలూరు, పడగల్,కామారెడ్డి ప్రాంతాల నుండి పూర్వ  విద్యార్థులు వచ్చి వారి సేవలను శ్లాఘిస్తూ అభినందిస్తూ పూలమాలలు శాలువాలతో ప్రత్యేకమైన బహుమతులతో ఘనంగా సన్మానించి,అప్పటి జ్ఞాపకాలని గత స్మృతులను నెమరు వేసుకున్నారు.

పండుగ మాదిరిగా జరిగిన ఈ పదవీ విరమణ కార్యక్రమం  షష్టిపూర్తిగా  బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య అపూర్వంగా జరగడం ఆమె సేవలను ప్రతి ఒక్కరు అభినందించడం ఎంతో మనోళ్లాసం కలిగించింది. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేతన కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జి. యల్ చలం, జిహెచ్ఎం, రామ్ మందిర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ విశ్రాంత మండల విద్యాధికారి రంగాచారి, పూర్వ ఉపాధ్యాయులు మాధవరెడ్డి సురేంధర్, పిఎస్ ప్రధానోపాధ్యాయులు  మధుసూదన్ రావు, కృష్ణయ్య, ఆత్మీయ బంధువులు అశోక్, చంద్ర ప్రకాష్,దత్తాద్రి, గంగరాజులు, ఆర్మూర్  సర్వసమాజ అధ్యక్షులు రెడ్డి ప్రకాష్, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు ధోండి నారాయణ వర్మ లు పాల్గొని, ఆమె సేవలను అభినందించారు. సమన్వయకర్తగా జింధం  నరహరి వ్యవహరించారు. మధ్యలో పాటలతో అచ్చ తెలుగు నుడికారాల పదసంపత్తితో  అక్కడికి వచ్చిన ఆత్మీయులు బంధువులందరినీ ఆకర్షించారు.ఆమె సేవల్ని స్తుతిస్తూ రూపొందించిన “అభినందన నామాక్షరమాల” అనే కరపత్రాన్ని ఆవిష్కరించి సన్మాన గ్రహీత వివిధ పాఠశాలలో చేసిన సేవలను గుర్తుచేసుకొని అభినందించారు.వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు హిందీ బోధకురాలుగా, అమ్మగా, అక్కయ్యగా మా క్షేమాన్ని కోరి బోధించిన తీరు మమ్మల్ని బాగా ఆకర్షించిందని గుర్తు చేసుకుని ఈ దంపతులు తమ శేష జీవితాన్ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ,సంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ “పదవీ విరమణ” శుభాకాంక్షలు తెలియజేసి శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
Spread the love