సమాచార హక్కు చట్టం  జిల్లా జాయింట్ సెక్రెటరీగా: సంకి రతన్ కుమార్

నవతెలంగాణ – రామారెడ్డి
సమాచార హక్కు చట్టం జిల్లా జాయింట్ సెక్రెటరీగా మండలంలోని  ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన సంకి రతన్ కుమార్ నియామకం అయ్యారు. జిల్లా కార్యాలయంలో సహా చట్టం రాష్ట్ర డైరెక్టట్ యం.ఎ సలీమ్ సోమవారం సంకి రతన్ కుమార్ కు నియామక పత్రం అందజేశారు.అనంతరం రతన్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను,నా బాధ్యతగా సక్రమంగా నిర్వహిస్తాను అని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాచార హక్కు చట్టం పై ప్రజలలో అవగాహనా  కలిపిస్తానాని అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ సమాచార హక్కు చట్టం ఉంటుందని ప్రజలకు తెలిసే విధంగా పనిచేస్తానాని అన్నారు.సమాచార హక్కు చట్టం కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ గా నియమించిన రాష్ట్ర డైరెక్టర్ యం.ఏ సలీమ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love