కోల్‌కత : ఐపీఎల్ ప్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది వేలంలో రికార్డు రూ. 27 కోట్లు దక్కించుకున్న రిషబ్ పంత్.. 2025 సీజన్లో లక్నోకు సారథ్యం వహించనున్నాడు. కోల్‌కతలో జరిగిన ఓ కార్యక్రమంలో లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీరు గోయెంకా, మెంటార్ జహీర్ ఖాన్లు పంత్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పంత్‌ను ఆ ప్రాంఛైజీ అట్టిపెట్టుకునేందుకు సిద్దమైనా.. నాయకత్వ బాధ్యతల అంశంలో బేధాభిప్రాయాలు రావటంతో స్టార్ వికెట్ కీపర్ వేలంలోకి వచ్చాడు. లక్నోలో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రామ్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ పంత్‌పై యాజమాన్యం నమ్మకం ఉంచింది.