రిస్క్‌-టేకింగ్‌

రిస్క్‌-టేకింగ్‌అబ్బా ఇప్పుడు ఈ రిస్క్‌ అవసరమా… రిస్క్‌ వల్ల ప్రయోజనం లేదు… కొంత మందికి రిస్క్‌ తీసుకునే ధైర్యం లేక.. చాలామంది వారి కంఫర్ట్‌జోన్‌లో ఉండటానికే ఇష్టపడటం వల్ల.. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ రిస్క్‌ తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా దఢంగా మారతారు. ఏదైనా సాధించే మనస్తత్వం పెరుగుతుంది…
రిస్క్‌-టేకింగ్‌ అనేది ఒక అవకాశాన్ని తీసుకోవడానికి, కొత్తదాన్ని ప్రయత్నించడానికే. అది విఫలమైనా కావచ్చు, లేదా అందులో విజయమూ సాధించవచ్చు. ఏదేమైనా గాని దాని ద్వారా అనుభవాన్ని పొందుతాం. కొన్ని నైపుణ్యాలను నేర్చుకునే అవకాశమూ ఉంది. వ్యక్తిగా నైపుణ్యాలు, సామర్థ్యాలు, విశ్వాసాన్ని పెంపొందించు కోవడానికి ఉపయోగపడుతుంది. రిస్క్‌లు తీసుకోవడం వలన పెద్ద లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి.
రిస్క్‌-టేకర్‌ను రూపొందించే కొన్ని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం:
ధైర్యం:
రిస్క్‌ తీసుకునేవారు భయాన్ని జయించగలుగుతారు. ఒత్తిడి సమయాల్లో ఎదుర్కొనే అనిశ్చితి, సందిగ్ధతను తట్టుకోగలుగుతారు. కొత్త ప్రదేశానికి ధైర్యంగా వెళ్తారు. ఓటమి భయంతో వెనక్కి తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
వద్ధి ఆలోచన:
ఏదైనా కొత్తగా సాధించాలంటే కొద్దిగా టాస్క్‌ తో పాటు కషి, అంకితభావం అవసరం. వారు నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. అలవాటు పడతారు.
ఆత్మ విశ్వాసం:
రిస్క్‌ తీసుకునేవారు సవాళ్లను స్వీకరిస్తారు. వారి సామర్థ్యాలపై ఆత్మవిశ్వాసంతో పాటు బలమైన నమ్మకాన్ని, సానుకూల దక్పథాన్ని కలిగి ఉంటారు.
నిర్ణయం తీసుకోవడం:
రిస్క్‌ తీసుకునేవారు ఎక్కువ సహనంతో ఉంటారు. వీరికి వారి సామర్ధ్యంపై నమ్మకమెక్కువ. బలమైన వ్యూహాత్మక ఆలోచనా నైపుణ్యాలతో పాటు, తాము సాధించబోయే విజయాలను ఊహించుకోవడం, వాటి బాగోగులను బేరీజు వేసుకోవడం చేస్తారు. అందుకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు.
బల్బు ఆవిష్కర్త థామస్‌ ఎడిసన్‌ 999 సార్లు విఫల యత్నాలు చేసి, చివరకు బల్బును కనుగొన్నాడు. అతను రిస్క్‌ తీసుకుని నేర్చుకోవడానికి, పని చేసే విధానాన్ని మార్చుకోవడంతోపాటు సవాళ్లను అధిగమించడం ఒక అవకాశంగా భావించాడు. గత వైఫల్యాల నుండి పొందిన జ్ఞానాన్ని వృద్ధిచేసుకుంటూ. ప్రతి ప్రయత్నంతో మెరుగుదల సాధించాడు.
రిస్క్‌ తీసుకోవడం వ్యక్తిగత లేదా వత్తిపరమైన విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన భాగం. రిస్క్‌ తీసుకుంటున్నప్పుడు అసాధారణమైన కొత్త అవకాశాలు, సవాళ్లు ఎదురవుతాయి. కంఫర్ట్‌ జోన్‌ను అధిగమించి, వైఫల్యాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోవచ్చు. రిస్క్‌లు తీసుకోవడం వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది.
మంచి రిస్క్‌ టేకర్‌గా ఎలా మారాలి?
ఓడిపోతామనే భయాన్ని అధిగమించడమే రిస్క్‌ తీసుకోవడంలో ముఖ్య దశ. మానసిక స్థితి సరిగా లేనప్పుడు చేస్తున్న పనిలో శ్రద్ధ పెట్టలేం. దాంతో విఫలమవుతాం. భయాందోళనను వీడి సానుకూల ఫలితాలపై దష్టి పెడితే ఫలితం సానుకూలంగా వుంటుంది.
ప్రణాళికాబద్ధమైన రిస్క్‌లు తీసుకోవడం:
అర్థరహిత మార్గాన్ని బుద్ధిహీనంగా అనుసరించడం కంటే, లక్ష్య ఆధారిత మార్గంలో జీవించడానికి లక్ష్యాలు సహాయపడతాయి. ఆలోచించండి… తీసుకుంటున్న రిస్క్‌ నుండి ఏమి సాధించాలనుకుంటున్నారు? కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వివిధ మార్గాలను కనుగొనడంలో తీసుకుంటున్న రిస్క్‌ సహాయపడుతుందా?
స్మార్ట్‌ లక్ష్యం
ఎంచుకున్న లక్ష్యం స్పష్టంగా వుంటే, ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం సులభమవుతుంది. కాబట్టి మీ లక్ష్యం సాధించదగినదిగా, వాస్తవికమైనదిగా భావించాలి. సమయానుకూల లక్ష్యం అత్యవసర భావాన్ని పెంచుతుంది. వాయిదా వేయడాన్ని నిరోధిస్తుంది.
లక్ష్యం-ఆధారిత ఆలోచన ఆశకు పునాది. ఇది దీర్ఘకాలికం లేదాస్వల్పకాలికం కావచ్చు. ‘నేను ప్రమోషన్‌ పొందాలనుకుంటున్నాను, డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను, వ్యాపార రంగంలో అనుభవాన్ని పొందాలనుకుంటున్నాను’ వంటివి లక్ష్యాలకు ఉదాహరణలు.
మెంటల్‌ ఇమేజరీ:
కోరుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఊహించుకుంటే మీ కలలు, లక్ష్యాలపై కొంత నమ్మకాన్ని పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం కలిగిస్తుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love