వాంఖడెలో రోహిత్‌ స్టాండ్‌!

Rohit stands at Wankhede!– ముంబయి క్రికెట్‌ సంఘం నిర్ణయం
ముంబయి : భారత క్రికెట్‌ టెస్టు, వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) సముచితంగా గౌరవించింది. వాంఖడె స్టేడియంలో స్టాండ్స్‌కు భారత మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌, రోహిత్‌ శర్మల పేర్లు ఖరారు చేస్తూ ఎంసీఏ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌ లెజెండ్స్‌తో పాటు క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌ దిగ్గజాలను సైతం ఎంసీఏ గౌరవించాలని తీర్మానించింది. ఐసీసీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సహా ఎంసీఏ మాజీ అధ్యక్షుడు అమోల్‌ కాలె గౌరవార్థం సైతం వాంఖడెలో స్టాండ్స్‌కు పేర్లు పెట్టాలని తీర్మానించింది.

Spread the love