రాష్ట్ర స్థాయి సర్టిఫికేట్ అందుకున్న ఆర్టీఐ రాష్ట్ర ప్రతినిధులు

rti-state-representatives-who-have-received-state-level-certificateనవ తెలంగాణ-మల్హర్ రావు
రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన ఆర్టిఐ ఉద్యమకారుల వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. కోర్స్ డైరెక్టర్ వివిధ సక్సెస్ స్టోరీలు వివరించారు. ఆర్టీఐ చట్టాన్ని అందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేర్చుకున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. శ్రీనివాస్ మాధవ్ రాo, సౌమ్య రాణి, రామచంద్రన్ లు శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికీ గ్రూపు ఫోటో, సర్టిఫికేట్ అందచేశారు. చివరగా అందరూ సహా చట్టం మీద ఫీడ్ బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల నుంచి హాజరైన ఆర్.టి.ఐ ఉద్యమ కారులు చింతల ,కుమార్,యాదవ్, చొప్పరి రాజయ్య, ముత్తోజు
వేణాచారి గ్రూపు ఫొటో, సర్టిఫికెట్ అందుకున్నారు.
Spread the love