మట్టిలో మాణిక్యం.. గుగులోత్ చరణ్

– జె ఇ ఇ లో ఆల్ ఇండియా 268 వ,ర్యాంక్ సాధన.
నవతెలంగాణ-నెల్లికుదురు :  జె ఇ ఇ లో ఆల్ ఇండియా 268ర్యాంకు సాధించి గుగులోతు చరణ్ మట్టిలో మాణిక్యం అనిపించుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం, తారసింగ్ బావి, ఖీమానాయక్ తండ చెందిన గుగులోతు చరణ్ అమ్మ నాన్న లు గుగులోతు వెంకన్న నాయక్ లలిత ఇద్దరు సంతానం చరణ్ పెద్దవాడు వీరిది మధ్యతరగతి కుటుంబం 10వ తరగతి వరకుహైదరాబాద్ సెయింట్ థెరిస్సా క్రిస్టియన్ చారిటీ స్కూల్ . ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీ లో ఎంపీసీ విభాగంలో అభ్యసించారు. 2024 సవంత్సరానికిగాను నిర్వహించిన అఖిల భారత జె ఈ ఈ అడ్వాన్స్ ప్రవేశపరీక్షలో ఎస్టి కేటగిరీ విభాగంలో ఆలిండియా 268 ర్యాంక్ సాధించి. భారత దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో అగ్రస్థానంలో వున్న ఐఐటి మద్రాస్ లో సీటు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈరోజు సీటు కన్ఫర్మ్ అయిన సమాచారం ఐ ఐ టి మద్రాస్ సీటు నిర్ధారణ విభాగం ద్వారా తెలియడం తో సంతొషం వ్యక్త పరిచారు. దీనికోసం ఇంటర్మీడియట్ పరీక్ష తోపాటు, జె ఈ ఈ అడ్వాన్స్ కోసం రోజుకు 12 గంటలు శ్రమించి గతసవంత్సరంలో నిర్వహించిన పరీక్ష పత్రాల విశ్లేషణ వలన మరియు తండ్రి, గురువుల ప్రోత్సాహం సాధ్యమైంది అని తెలియచేశారు. మారుమూల గిరిజన తండా నుండి ఐఐటీ మద్రాస్ లో అభ్యసించే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నాను. కనుక ఇతరం యువకులకు నేను ఇచ్చే సలహా ఒక లక్ష్యంతో కష్టపడి చదివితే ఏదైనా సాధ్యం ఆని తెలియ చేసారు.
Spread the love