వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తా: రుద్రారం సురేష్

– మండల ఐరన్ , హార్డ్వేర్ అసోసియేషన్ అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో ఐరన్ , హార్డ్వేర్, సిమెంట్ ప్లైవుడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాపార అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అసోసియేషన్ నూతన అధ్యక్షులు రుద్రారం సురేష్ అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో మండలంలోని ఐరన్, హార్డ్వేర్, సిమెంట్ ప్లైవుడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దుకాణదారులందరూ సమావేశమై అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా అసోసియేషన్ అధ్యక్షులుగా రుద్రారం సురేష్ ని మరియు ఉపాధ్యక్షులుగా సామ మల్లారెడ్డినీ , ఎడవెల్లి వెంకటరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా వల్పదాస్ రవిశంకర్ ని సహాయ కార్యదర్శి వినుకుళ్ళు శ్రీనివాస్ ని కోశాధికారిగా చామర్తి రమేష్ ను ఆర్గనైజర్ గా బండి మోహన్ను కార్యవర్గ సభ్యులు దూడ రమేష్ సుప్పరి సంపత్ ఎండి జాకీర్ దుగ్గినేని రమణయ్య దోనేపూడి వేణు కారు పోతుల ఏకాంబరం రమేష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్షులైన రుద్రారం సురేష్  మాట్లాడుతూ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న కమిటీ వారందరికీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి దుకాణదారుల అభివృద్ధికి దుకాణదారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ మండలము మరియు చుట్టుపక్కల గ్రామాలు పక్క మండలాలైన గ్రామాల వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన వస్తువులు సామాగ్రి అందేలాగా కృషి చేస్తానని, అధ్యక్షునిగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులకు మరో మారు ధన్యవాదాలు తెలిపారు.
Spread the love