Tuesday, June 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపెజెష్కియాన్ రాజీనామా పై వదంతులు

పెజెష్కియాన్ రాజీనామా పై వదంతులు

- Advertisement -

అది విదేశీ మీడియా
అవాస్తవ ప్రచారం : అధ్యక్ష కార్యాలయం

టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ వదంతులు వ్యాపించాయి. ఆయన తన రాజీనామాను సుప్రీం నేత కార్యాలయంలో సమర్పించారని మీడియా కథనాలు వెల్లడించాయి. కీలక విధాన నిర్ణయాలలో తన ప్రభుత్వ పాత్ర పరిమితమవుతోందని, దేశ అధికార వ్యవస్థలో కరుడుకట్టిన వర్గాల ప్రభావం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… పెజెష్కియాన్ ఆదివారం నాడు తన అధికారిక రాజీనామా లేఖను పంపారు. ప్రధానమైన నిర్ణయాలలో అధ్యక్షుడికి, ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా పోయిందని ఆయన ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి కారణంగా శూన్యత ఏర్పడి ప్రభుత్వ వ్యవహారాలలో కరుడుకట్టిన శక్తులు… ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూ షనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానిన సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నానని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చ లేకపోతున్నానని తెలిపారు. పదవి నుంచి తక్షణమే వైదొలిగేందుకు అనుమతిం చవలసిం దిగా పెజెష్కియాన్ ఆ లేఖలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -