పదవి ముగిసిన పాలకవర్గానికి గ్రామీణ వైద్యుడు సన్మానం

నవతెలంగాణ – మహాదేవపూర్
మండలంలోని కుదురుపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవి కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో వారు గ్రామ ప్రజలకు అందించిన సేవలు, గ్రామాభివృద్ధికి పాల్పడిన సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన సీనియర్ గ్రామీణ వైద్యుడు, ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్ల అశోక్ ఆధ్వర్యంలో పాలకవర్గానికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కోట లక్ష్మీ సమ్మయ మాట్లాడుతూ గ్రామంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది సిసి రోడ్డు లు డ్రెనేజిలు ఎలుయిడి లైట్లు పల్లె ప్రకృతి వనం స్మశాన వాటిక ఇంకా చాలా క్రయక్రమాలు మా వార్డు సబ్యల ఉప సర్పంచ్ గ్రామ పెద్దల సహకారంతో చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మన్, వార్డు సబ్యలు వంశీ వెంకటేష్ శేషికాంత్ జగరి సమ్మక్క జిముడా సారక్క గోగుల పోషక్క మడే మల్లక్క గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Spread the love