బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే..

నవతెలంగాణ – మోపాల్ 

గురువారం రోజున  బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  అన్ని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు .ఈసందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ బోర్గం ప్రభుత్వ పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల కింద 22 లక్షల రూపాయలను కేటాయించామని ఈ పాఠశాలకు జిల్లాలోనే ప్రాముఖ్యత ఉందని బోర్గం పాఠశాలలో చదివిన వారు చాలా మంది దేశ విదేశాల్లో ఉంటూ మంచి ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని కేవలం ధనార్జన  తప్ప ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టలేదని కెసిఆర్ ప్రభుత్వానికి దాచుకోవడం దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడమనే తెలియదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ ప్రారంభమైందని, టీచర్ పోస్టుల భర్తీలను కూడా త్వరలో చేసి తీరుతామని,  ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మానస పుత్రిక అని ఈ నిధులే కాకుండా వచ్చే రోజులలో మరిన్ని నిధులను కేటాయించి ఇంకా మౌలిక సదుపాయాలు కూడా కల్పించే విధంగా చూస్తామని ఆయన తెలిపారు పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని, ఆ దిశగా పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని, ఇంటర్మీడియేట్‌ వరకూ  ఇ క్కడే చదువుకోవచ్చన్నారు.  పిలుపునిచ్చారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌ గౌడ్, చామకూర అనిల్ రెడ్డి ,నాయకులు  ఈగ రమేష్‌రెడ్డి, సాయిరెడ్డి, గుత్ప రఘు, సుభాష్, శేఖర్‌రెడ్డి, , సుదర్శన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అనిల్‌ రెడ్డి, అశోక్, తదితరులు ఉన్నారు.
Spread the love