Tuesday, June 9, 2026
E-PAPER
Homeఆటలురుతురాజ్‌ గైక్వాడ్‌ శతకం.. శ్రీలంక టార్గెట్‌ 278

రుతురాజ్‌ గైక్వాడ్‌ శతకం.. శ్రీలంక టార్గెట్‌ 278

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దంబుల్లాలో శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 114 బంతుల్లో 101 పరుగులు చేయగా, కెప్టెన్ తిలక్ వర్మ 97 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోనీ, సూర్యాంశ్ షెడ్జ్ లంక బౌలర్లపై బ్యాట్ ఝలిపించారు. ఈ ఇద్దరూ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరి మధ్య 46 పరుగుల ఇంపార్టెంట్ భాగస్వామ్యం నెలకొన్న తర్వాత బదోనీ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయినప్పటికీ మనోళ్లు నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 277 రన్స్ బోర్డుపై పెట్టారు. శ్రీలంక పిచ్‌లపై ఈ స్కోర్‌ను కాపాడుకోవడం మన బౌలర్లకు పెను సవాల్ గా మారింది. శ్రీలంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీయగా, కరుణరత్నే, సంకేత్, వనుజా తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -