రెండోరౌండ్‌కు రైబకినా

రెండోరౌండ్‌కు రైబకినా– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌, కజకిస్తాన్‌కు చెందిన 4వ సీడ్‌ రైబకినా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో రైబకినా 6-2, 6-3తో మిన్నెన్‌(జర్మనీ)ని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ సుమారు 73నిమిషాలసేపు సాగింది. రెండోరౌండ్‌లో రైబకినా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత కెర్బర్‌(జర్మనీ) తలపడనుంది. మరో పోటీలో 7వ సీడ్‌ జంగ్‌(చైనా) 6-2, 6-1తో కామెట్‌(ఫ్రాన్స్‌)ను ఓడించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.
మెద్వదెవ్‌, రూఢ్‌ శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో 7వ సీడ్‌ రూఢ్‌(నార్వే), 5వ సీడ్‌ మెద్వదెవ్‌(రష్యా) శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీల్లో రూఢ్‌ 6-3, 6-4, 6-3తో ఆల్వేస్‌(దక్షిణాఫ్రికా), మెద్వదెవ్‌ 6-3, 6-4, 5-7, 6-3తో కోఫర్‌(జర్మనీ)ని ఓడించారు. ఇక అమెరికా సంచలనం బెన్‌ షెల్టన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తొలిరౌండ్‌లో షెల్టన్‌ 3-6, 6-3, 6-4, 6-4తో స్థానిక ఆటగాడు హ్యూగో గాస్టన్‌ను ఓడించాడు. రెండోరౌండ్‌లో షెల్టన్‌ జపాన్‌కు చెందిన నిషికోరితో తలపడనున్నాడు. తొలిరౌండ్‌లో నిషికోరి 7-5, 7-6(7-3), 3-6, 1-6, 7-5తో గాబ్రియేల్‌ను ఓడించి రెండోరౌండ్‌కు చేరాడు.

Spread the love