శభాష్‌ ప్రణయ్

హైదరాబాద్‌: కోపెన్‌హగన్‌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన యువ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ అభినందనల జల్లు కురుస్తూనే ఉన్నది. కాంస్య పతకంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రణయ్ ను జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, గురుసాయిదత్‌, గోపీ తల్లి సుబ్బరావమ్మ సన్మానం చేసి చిరు సత్కారం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పతకంతో దేశానికి, రాష్ట్రానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావడం గర్వకారణమని సుబ్బరావమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అన్నారు. సన్మాన కార్యక్రమంలో సీనియర్‌ కోచ్‌ రాజేందర్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Spread the love