పెగూల, వోండ్రుసోవా శుభారంభం

– అన్‌సీడెడ్‌ చేతిలో ఓడిన గార్సియా
– యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్‌ సబలెంకా(రష్యా), 3వ సీడ్‌ పెగూలా(అమెరికా), 9వ సీడ్‌ వోండ్రుసోవా(చెక్‌) శుభారంభం చేయగా.. 7వ సీడ్‌ గార్సియా(ఫ్రాన్స్‌) తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం రాత్రి జరిగిన తొలిరౌండ్‌ పోటీల్లో పెగులా 6-2, 6-2తో జియోర్గి(ఇటలీ), వోండ్రుసోవా 6-3, 6-0తో హాన్స్‌(కొరియా)పై సునాయాసంగా విజయం సాధించారు. ఇక గార్సియా(ఫ్రాన్స్‌) 4-6, 1-6తో వాంగ్‌(చైనా) చేతిలో ఓటమిపాలైంది.
మరో పోటీలో 17వ సీడ్‌ కీస్‌(అమెరికా) 6-2, 6-4తో ఆర్కంకా రస్‌(నెదర్లాండ్స్‌)పై, 25వ సీడ్‌ ప్లిస్కోవా(చెక్‌) 6-1, 6-4తో రూసే(జర్మనీ)పై, కెనిన్‌(అమెరికా) 7-6(7-2), 6-4తో బోర్డన్‌(జర్మనీ)పై గెలిచారు. ఒక 12వ సీడ్‌ క్రేజీకోవా(చెక్‌) 4-6, 6-7(3-7)తో అన్‌సీడేడ్‌ బ్రోంజెట్టి(ఇటలీ) చేతిలో ఓటమిపాలైంది.
అల్కరాజ్‌ సునాయాసంగా..
ఇక పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌) శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో అల్కరాజ్‌ 6-2, 3-2తో ఆధిక్యతలో ఉన్న దశలో కూఫర్‌(జర్మనీ) గాయం కారణంగా మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. ఇతర పోటీల్లో 5వ సీడ్‌ సిన్నర్‌(ఇటలీ) 6-3, 6-1, 6-1తో హంట్మ్‌న్‌(జర్మనీ)పై, 26వ సీడ్‌ ఎవాన్స్‌(బ్రిటన్‌) 6-4, 6-2, 7-5తో గలన్‌(కొలంబియా)పై సునాయాసంగా నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన వావ్రింకా 7-6(7-5), 6-2, 6-4తో నిషియెకా(జపాన్‌)పై గెలుపొందగా.. ఐదుసెట్ల హోరాహోరీ పోరులో హుర్క్‌రాజ్‌, చైనాకు చెందిన యు గెలిచారు. హుర్క్‌రాజ్‌(పోలండ్‌) 4-6, 5-7, 7-6(7-5), 6-3, 6-1తో హుస్టర్‌(స్విట్జర్లాండ్‌)పై, చైనాకు చెందిన యు 3-6, 6-4, 2-6, 6-4, 6-2తో లాజోవిక్‌(క్రొయేషియా)పై నెగ్గి ముందుకు దూసుకెళ్లారు. ఇక 13వ సీడ్‌ డి-మేనర్‌(ఆస్ట్రేలియా) 6-2, 3-6, 6-1, 7-5తో సికాటోవిక్‌(కజకిస్తాన్‌)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించాయి.

Spread the love