– సుదీర్మన్ కప్‌కు భారత జట్టు
న్యూఢిల్లీ : భారత డబుల్స్ స్టార్ సాత్విక్, చిరాగ్ జోడీ సుదీర్మన్ కప్‌లో బరిలోకి దిగనున్నారు. గాయంతో ఆసియా చాంపియన్‌షిప్స్‌కు దూరమైన సాత్విక్, చిరాగ్‌లు ఈ నెల 27 నుంచి చైనాలో జరుగనున్న సుదీర్మన్ కప్‌లో పోటీపడనున్నారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫార్మాట్‌లో జరిగే సుదీర్మన్ కప్‌కు భారత జట్టును మంగళవారం ఎంపిక చేశారు. పి.వి సింధు, లక్ష్యసేన్, హెచ్.ఎస్ ప్రణరు సైతం బరిలో ఉన్నారు. భారత జట్టు : లక్ష్యసేన్, హెచ్. ఎస్ ప్రణరు, పి.వి సింధు, అనుపమ, సాత్విక్-చిఆర్, హరిహరణ్-రూబెన్, శృతి-ప్రియ, తనీశ-కపిల, ఆద్య-సతీశ్.