ఘనంగా ఆర్మూర్ పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్ బతుకమ్మ
ఆర్మూర్ బతుకమ్మ

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని పెర్కిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించినారు. వివిధ రకాల పూలతో వైవిద్యంగా అలంకరించిన బతుకమ్మలను ప్రధాన కూడళ్లలో పెట్టి సంబరంగా ఆడిపాడారు. సకల సౌభాగ్యాలు అందించుమా… వచ్చే ఏడే మళ్లీ రావమ్మ.. అంటూ వీడ్కోలు పలికారు. పసుపు బొట్లు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వెంట తెచ్చుకున్న సద్దులను పంచుకొని ఆత్మీయంగా ఆరగించారు.

Spread the love