కపిలవాయి లింగమూర్తి పురస్కారాలు
కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠం నిర్వహణలో డా|| కపిలవాయి లింగమూర్తి పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈరోజు హైదరాబాద్ రవీంద్రభారతి సెమినార్ హాల్లో సాయంత్రం 5.30 గంటలకు జరుగుతుంది. కపిలవాయి లింగమూర్తి మీనాక్షమ్మల సాహిత్య పురస్కార గ్రహీతలు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి (2023), డా. కొల్లోజు కనకాచారి (2024), కపిలవాయి కిశోర్ బాబు భార్గవీ దేవీల సాహిత్య పురస్కార గ్రహీతలు వల్లభాపురం జనార్దన (2023), వనపట్ల సుబ్బయ్య (2024). – కపిలవాయి అశోక్ బాబు
బీసీ వాద కవిత్వానికి ఆహ్వానం
బీసీ అస్తిత్వ, సాంస్కతిక, రాజకీయవాదాన్ని బలపరుస్తూ బీసి కవుల నుండి వచన కవితలకు ఆహ్వానిస్తున్నాం. కవితలను 15, ఏప్రిల్ 2025 లోపు [email protected] వాట్సప్ నెంబర్ 9492765358కు పంపించగలరు. బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి బీసీ సాహిత్య సదస్సులో సంకలనంగా ప్రచురించి ఆవిష్కరిస్తాం.
– వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్