నవతెలంగాణ – ఆర్మూర్
లక్షల్లో జీతాలు..అయినా కాసుల కోసం కక్కుర్తి పడిన అధికారులు.. ఫైలుకు ఒక రేటు ..సంతకానికి ఒక రేటు..క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో సమయ పాలన పాటించని ఉద్యోగులు..జిల్లాలోని డివిజన్ పరిధిలో నిత్యం చోటుచేసుకుంటున్న అధికారుల, ఉద్యోగుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంటుంది. గతంలో ఆర్డిఓ గా పనిచేసిన ఒకరిని, ఐసిడిఎస్ ఇంచార్జ్ పిడి లను ఏసీబీ అధికారులకు పట్టించిన మార్పు రావడం లేదు. డివిజన్ కేంద్రంలో ఆ,ర్డీవో డీఎల్పిఓ, పంచాయతీరాజ్ ,పోలీస్ ,ఫారెస్ట్ తహసిల్దార్, ఆర్ టి ఓ, సబ్ రిజిస్టర్ ఎక్సైజ్ తదితర కార్యాలయాలు ఉన్నవి.
అవినీతి అనకొండ గా..
జిల్లా కోపరేటివ్ ఆఫీసర్గా పనిచేసిన సింహాచలం అవినీతి ఆనకొండకు మారుపేరుగా వ్యవహరించిన సంఘటన గత రెండు నెలల కింద తీవ్ర సంచలనం రేపింది. ఇతని అక్రమాలను అవినీతిని అక్రమ వసూళ్లను భరించారే తప్ప సొసైటీ చైర్మన్ లలో ఏ ఒక్కరు కూడా సహకార శాఖకు సమాచారం కానీ వసుళ్ళ పర్వం గురించి బయటకు చెప్పలేని పరిస్థితిని కల్పించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో జనవరి 16న ఇతన్ని బదిలీ చేసింది. ఈయన సొంత జిల్లా శ్రీకాకుళం నుంచి పదిమంది నిపుణులలను తీసుకొచ్చి రికార్డులను ట్యాపరింగ్ (దొంగ లెక్కలతో కొత్త రికార్డులను తయారు) చేసినారు.. కొత్త డిసిఒ శ్రీనివాస్ వచ్చిన రికార్డులను అప్పగించకుండా ఆయన దగ్గరన నే ఉంచుకోవడంతో ఫిబ్రవరి 20న కమిషనరేట్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
పాలన సౌకర్యం కోసం..
గత బి ఆర్ స్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామాల ప్రతిపాదికన ముమ్మరం చేసినారు.. డివిజన్ లోని ఆలూరు డొంకేశ్వర్ లు నూతన మండలాలుగా ఏర్పాటైనవి .అటవీ శాఖలో ఒక డివిజన్ స్థాయి అధికారి తీవ్ర విమర్శలకు దారితీసింది .జిల్లా వ్యాప్తంగా టింబర్ దుకాణాలు, సామిల్లు, కార్పెంటర్ షాపుల వ్యాపారులు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకొని కట్టే వ్యాపారం చేస్తున్నారు .వీరు అటవీ శాఖ నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాల్సి ఉంటుంది .అయితే ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్సుల పునరుద్ధరణకు వ్యాపారులు 5వేలతో చాలాన్ తీసి అటవీశాఖ అధికారులకు అందజేస్తారు. చాలన్ కట్టినప్పటికీ అటవీ అధికారులు టింబర్ డిపోలు, సామీలు, కార్పెంటర్ దుకాణాలను ప్రత్యక్షంగా తనిఖీలు చేస్తారు .అధికారుల చల్లని చూపు తమపై ఎల్లప్పుడూ ఉండేందుకు వ్యాపారులు వేళల్లో ముడుపులు అందజేయడం ఒకవైపు జరగగా ….మీరు ఇచ్చినంత కాదని నేను అడిగినంత ఇవ్వాలని వ్యాపారులకు హుకుం జారీ చేసిన అధికారిపై రాష్ట్ర శాఖకు ఫిర్యాదు చేసినారు. నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన అధికా రే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడడం డొంకేశ్వర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను పంచాయతీ కార్యదర్శికి సమాచారం లేకుండానే కారోబార్ డ్రైవర్లను బలవంతం పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది. ఆయనపై డి ఎల్ పి ఓ విచారణ సైతం జరిపినారు. ఆలూర్ మండల తాసిల్దార్ చేతులు తడప నీదే పనులు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యం నిమిత్తం కొత్త మండలాన్ని ఆయా గ్రామాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అధికారుల్లో మార్పులు రాకపోవడం గమనర్హం.