ముంపు బాధితులకు కాంగ్రెస్ పార్టీ పరిష్కార మార్గం చూపుతుంది

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో సోమవారం రోజున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ కిసాన్  అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, మరియు మండల అధ్యక్షుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామంలోని ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్ప గంగా రెడ్డి  మాట్లాడుతూ సకల జనులకు అన్ని సంక్షేమ పథకాలు చేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు వచ్చిన 100 రోజులలోనే పార్టీ ప్రకటించిన కాంగ్రెస్ గ్యారంటీలు అమలుపరచారన్నారు, అలాగే నిరుపేదలకు  పని దొరకక సతమవుతమవుతున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి కుటుంబానికి వంద రోజులకు తక్కువ కాకుండా పని కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూలీలకు రూ.400 రూపాయలు రోజువారి కూలి తగ్గకుండా అందజేయమన్నారు అదేవిధంగా రూ.500 రూపాయలకే వంటగ్యాస్ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా మహిళ సోదరీమణులకు అందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. రైతులకు ఆగస్టు 15 లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడని వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచిప్పపరిసర ప్రాంతాలైనటువంటి బైరాపూర్ ,అమ్రాబాద్ తాండాలు రీ డిజైన్ తోని భయాందోళనలకు గురవుతున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ముంపు బాధితులందరికి బాసటగా నిలిచి, మంచిప్ప నడి బొడ్డు పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంచిప్ప కాలేశ్వరం 21 ప్యాకేజీ పాత డిజైన్ ప్రకారంగా నిర్మించి నిజామాబాద్ రూరల్ ప్రజలందరికీ సాగునీరు అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించడం జరిగింది .దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మా ఎమ్మెల్యే గౌరవ భూపతిరెడ్డి   మంచిప్ప వేదిక పైననే ప్రజలందరికీ వివరించడం జరిగింది, మనం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందుటకు ప్రజా సంక్షేమం కొరకు మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకొని భూపతిరెడ్డి మరియు జీవన్ రెడ్డి గ తోని మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోదామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోపాల్ మండల్ వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్ సింగ్, బ్యాంక్ డైరెక్టర్ గోర్కంటి లింగన్న,తిరుపతి రెడ్డి , సర్పంచ్ గంగాప్రసాద్ ,ముత్యం రెడ్డి ,సాయిరాం ,రాజేష్ ముదక్ పల్లి మాజీ సర్పంచ్ రాధాకృష్ణ ,మోహన్ రెడ్డి వెంకట్రాం గోవురు భూపతిరెడ్డి, మరియు మోపాల్ మండల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love