హైదరాబాద్‌లో రూ.4వేల కోట్ల ఆస్తుల విక్రయం

హైదరాబాద్‌లో రూ.4వేల కోట్ల ఆస్తుల విక్రయం– నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రిపోర్ట్‌
హైదరాబాద్‌ : నగరంలో అధిక విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుత ఏడాది మార్చిలో రూ.4,000 కోట్ల పైగా విలువ చేసే ఆస్తులు విక్రయించబడ్డాయని సోమవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 6,416 నివాస ప్రాపర్టీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ 12 శాతం పెరిగింది. గత నెల రిజిస్ట్రేషన్‌ అయిన వాటిలో దాదాపు 70 శాతం గృహలు 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే 16 శాతం ఆస్తులు రూ.1 కోటి కంటే ఎక్కువ విలువ చేసేవి ఉన్నాయి. ధరల పరంగా రూ. 25 లక్షల నుండి 50 లక్షల శ్రేణిలో ఉన్న ఆస్తుల వాటా 45 శాతంగా ఉన్నాయి. కాగా.. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మొత్తం రిజిస్ట్రేషన్లలో 14 శాతానికి తగ్గింది. మరోవైపు రూ.1 కోటి పైగా ధర ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్‌లలో భారీ పెరుగుదల కనిపించింది. వీటి వాటా 2023 మార్చిలో 10 శాతంగా ఉండగా.. మార్చి 2024 నాటికి 16 శాతానికి పెరిగింది. ఈ రిపోర్ట్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను పరిగణలోకి తీసుకుంది.

Spread the love