
సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ గా సమీర్ అహ్మద్ ఖాన్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ తహసీల్దార్ గా విధులు నిర్వహించిన జోగినిపల్లి రాజేశ్వర్ రావు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించిన సమీర్ ఖాన్ చేర్యాలకు బదిలీపై వచ్చారు.