శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ విడుదల

నవతెలంగాణ హైదరాబాద్: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. ఎస్‌23 లాగానే వెనక వైపు ట్రిపుల్‌ కెమెరా సెట్‌, డిజైన్‌తో వస్తోంది. ప్రస్తుతానికి శాంసంగ్‌ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంది. ఇది ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌ ధర 599 డాలర్లు (దాదాపు రూ.49,800)గా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫీచర్లు

 శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ క్రీమ్‌, పర్పుల్‌, గ్రాఫైట్‌, మింట్‌ రంగుల్లో… 8GB ర్యామ్‌, 128GB మెమొరీ, 8GB ర్యామ్‌ 256GB మెమొరీ వేరియంట్లలో లభిస్తుంది. అక్టోబర్‌ 26 నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానుంది. భారత్‌లో దీని ధర ఎంతో ఇంకా వెల్లడించలేదు. 6.3 అంగుళాల అమోలెడ్‌ ప్యానల్‌తో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 లేదా ఎక్సినోస్‌ 2200 చిప్‌సెట్‌ , 50 ఎమ్‌పీ+8 ఎమ్‌పీ+12 ఎమ్‌పీ కెమెరాలు, సెల్ఫీకి 10ఎమ్‌పీ కెమెరా, 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 25వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను దీనిలో వాడారు. బ్లూటూత్‌ 5.3, వైఫై 6ఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Spread the love