సంక్రాంతి ముగ్గుల పోటీలు.. విజేతలకు బహుమతి ప్రధానోత్సవం

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ఆదివారం, సిపిఐఎం పెద్ద కందుకూరు గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు శాఖ కార్యదర్శి కాలే స్వామి అధ్యక్షత వహించారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక ఆర్థిక సంస్కృతిక రంగాల్లో పనిచేస్తుందని చెప్పారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలు చందన ప్రదమ బహుమతి, ద్వితీయ బహుమతి శ్రావణి, తృతీయ బహుమతి వర్ష, సత్యలక్ష్మి గెలుపొందారు. పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, సర్పంచ్ భీమగాని రాములు గౌడ్, నాయకులు పత్తి నరసింహులు, జమ్ము వెంకటేష్, కాలే రాజు, కోడూరు సిద్ధులు, కాల్లే బాలరాజు, గవల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love