సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ ఆర్.రమేశ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతు సంఘం నేత, రాజకీయ విశ్లేషకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి నవతెలంగాణ పత్రికకు తీరని లోటు అని ఆ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్ పేర్కొన్నారు. మల్లారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాశక్తి, నవతెలంగాణ జర్నలిజం కళాశాలల్లో ట్రైనీ జర్నలిస్టులకు, నవతెలంగాణ సిబ్బందికి సాగునీటిరంగం, రెవెన్యూ, వ్యవసాయ రంగాలపై క్లాసులు బోధించి జ్ఞానాన్ని అందించేవారని గుర్తుచేశారు. నవతెలంగాణ పత్రిక నిర్వహణకు విలువైన సలహాలు, సూచనలు అందించేవారని తెలిపారు. ప్రజలను, రైతులను చైతన్యపరిచేలా నవతెలంగాణ, ప్రజాశక్తి పత్రికల్లో రెగ్యులర్‌గా వ్యాసాలు రాసేవారని గుర్తుచేశారు.
మల్లారెడ్డి మృతికి తెలంగాణ సాహితి సంతాపం
సారంపల్లి మల్లారెడ్డి మృతికి తెలంగాణ సాహితి సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్థన, కార్యదర్శి కె.ఆనందాచారి ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లారెడ్డి మృతికి సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతాంగ ఉద్యమంలో మల్లారెడ్డి పాత్రను గుర్తుచేశారు. ఆయన మరణం ప్రజా, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
సారంపల్లి మల్లారెడ్డి మృతి నవతెలంగాణకు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



