సారే రావాలి.. కారే కావాలి..

 – యెస్ బి పల్లి లో ఎన్నికల ప్రచారం.
 – అంజన్న కే మా ఓటు అంటున్న ప్రజలు.
 –  కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని సాధించుకుందాం.
 – బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు కడల శ్రీశైలం.
నవతెలంగాణ- కొత్తూరు: మండలంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని సాధించుకుందామని బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు కడల శ్రీశైలం అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన యెస్ బి పల్లి లో గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమ్మరి గూడెం పాండు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ఎన్నికల  ప్రచారం నిర్వహించారు.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, కెసిఆర్ భరోసా, సౌభాగ్య లక్ష్మి, మహిళా సమైక్యలకు సొంత భవనాలు, అన్నపూర్ణ పథకం, అగ్రవర్ణాల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి పథకాల పట్ల ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు అంజన్నకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని అంజన్న మరో మారు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మె నర్సింహా, అంబటి నర్సింహా, అంబటి కృష్ణయ్య, జమకాయల కృష్ణ, మన్నె లక్ష్మయ్య, తిరుపతి, శీను, రామచంద్రి తదితరులు పాల్గొన్నారు.
Spread the love