- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లీ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో గురువారం ఆ గ్రామ సర్పంచ్ అమృత్వర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగన్వాడి పిల్లలకు స్కూల్స్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని చిన్నారులను అంగన్వాడీకి పంపాలని తలిదండ్రులకు సూచించారు. పిల్లలకు కావాల్సిన పోషకాహారం, దుస్తులు, తదితర సౌకార్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, వార్డు మెంబర్ నిర్మల, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



