- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామానికి చెందిన తోట బాల లచ్చక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ శుక్రవారం బాధితురాలు కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం 25 కిలోల సన్నబియ్యం బస్తా,నిత్యావసర సరుకులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



