27న జరిగే పీడీఎస్ యూ జనరల్ కౌన్సిల్ ను విజయవంతం చేయండి: సతీష్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏప్రిల్ 27నా కొత్తగూడెం పట్టణం లో జరిగే ప్రగతిశిలా  ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భం గా సతీష్ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో జరిగే జనరల్ కౌన్సిలింగ్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థిసంఘం విద్యార్థు ల సమస్యలపై విద్య రంగ సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. విద్యా కాషాయీకరణ కార్పోరేటికరణ వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు మోజీ రామ్ నాయకులు తార చంద్, లక్ష్మమాన్, సంతోష్, శ్రీనివాస్, ప్రకాష్ పాల్గొన్నారు.
Spread the love