అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు చదవడం,మాట్లాడటం నేర్చుకుంటారు: సీడీపీఓ రోజారాణి

నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడి కేంద్రానికి వచ్చిన పిల్లలకు శారీరక,మానశిక,భాషాభివృద్ధి పెరుగుతుందని ఐసీడీఎస్ పీడీ ఓ రోజా రాణి తెలిపారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తూర్పు బజార్ అంగన్వాడి కేంద్రంలో గురువారం ప్రీ – స్కూల్ యానివర్సరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం లో పిల్లలకు ఇరుగు పొరుగు  పిల్లలతో కలిసి మెలిసి  వుండటం నేర్చు కుంటారు అని అన్నారు. మూడున్నర సంవత్సరాల నుండే అంగన్వాడీ కేంద్రంలో  చేర్పించాలని తల్లులకు ఐసీడీఎస్ (మాతా శిశు సంరక్షణ ) సీడీపీఓ రోజా రాణి సూచించారు. అంగన్వాడి కేంద్రానికి పిల్లలను పంపకుండా నేరుగా బడికి పంపితే పిల్లలతో చనువు ఏర్పడక పోగా,కనీసం మాట్లాడటం కూడా రాదని తెలిపారు. ఈ కేంద్రానికి  పెను కుల అన్వేష్ 15 చిన్న కుర్చీలు,వెంకటలక్ష్మి 4 పెద్ద కుర్చీలు,ఎస్.కే  రెహానా  ప్యాన్ 1,వాల్ క్లాక్ 1,ఎస్.కే సమీరా సుల్తాన్ 15 చాపలు, పలకలు విరాళంగా అందజేసారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు విజయలక్ష్మి,పద్మ,అంగన్వాడీ టీచర్ లు కే.నాగమణి,శిరీష, జ్యోతి,నాగమణి ఇందు, తల్లులు పాల్గొన్నారు.
Spread the love