Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ ఎంపీడీవో గా సత్యనారాయణ రెడ్డి

మద్నూర్ ఎంపీడీవో గా సత్యనారాయణ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల నూతన ఎంపీడీవో గా సత్యనారాయణ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాం పటేల్, పలువురు సర్పంచులు కలిసి ఆయనకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇదివరకు మద్నూర్ ఎంపీడీవో గా విధులు నిర్వహించిన రాణి మంగళవారం పదవి విరమణ పొందారు. మద్నూర్ ఎంపీవోగా విధులు నిర్వహించే సత్యనారాయణరెడ్డికి ప్రభుత్వం ఎంపీడీవో గా పదోన్నతి కల్పించింది. దీంతో సిబ్బందితో పాటు పలువురు పుష్పగుచ్చం అందజేసి, అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -