ముంబయి : ఔత్సాహిక మహిళ వ్యాపారవేత్తలకు చౌక రుణాలు అందించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. తక్కువ వడ్డీరేటుకే పూచీకత్తు లేకుండా అప్పులివ్వనున్నట్టు ఆ బ్యాంక్ చైర్మెన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ‘అస్మిత’ పేరుతో ప్రత్యేక రుణాలను జారీ చేయనున్నామన్నారు. మహిళల ఆధ్వర్యం లోని ఎంఎస్‌ఎంఇలకు వేగంగా, సులభంగా రుణాలను అందిస్తామన్నారు.