హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యాదాగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బ్యాటరీలతో కూడిన మూడు వాహనాలను అందించింది. వీటికి సంబంధించిన తాలం చెవులను ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ గీతాకు అందజేశారు.