రెండు ఎన్‌జిఒలకు ఎస్‌బిఐ సాయం

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ మరో రెండు స్వచ్ఛంద సంస్థల కు సాయం చేసింది. 68వ బ్యాంక్‌ డే సందర్భంగా శనివారం కార్పొరేట్‌ సామాజిక సేవ (సిఎస్‌ఆర్‌)లో భాగంగా ఫ్రండ్స్‌ ఫౌండేషన్‌, స్పూర్తి జ్యోతి ఫౌండేషన్‌ సంస్థలకు ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ జింగ్రాన్‌ మారుతి ఈకో వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిఎం ఎన్‌ డబ్ల్యు-1 మంజూ శర్మ, జిఎం, ఎన్‌డబ్ల్యు-2 దేబాషిష్‌ మిత్రా, ఉన్నతాధి కారులు విద్యా రాజా, ఎస్‌ పనిగ్రహి, జితేంద్ర కుమార్‌ శర్మ, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఎస్‌బిఐ రూ.50,000 కోట్ల నికర లాభాల మార్క్‌ను చేరినందున ఉద్యోగులకు జింగ్రాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని మైలురాయిలను చేరడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Spread the love