ఎస్‌బీఐ ఐదో స్టార్టప్‌ బ్రాంచ్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ ఎస్‌బీఐ తన ప్రత్యేకమైన ఐదవ స్టార్టప్‌ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో తెరిచింది. మాదాపూర్‌ సమీపంలో ఏర్పాటుచేసిన ఈ శాఖను సోమవారం ఎస్‌బీఐ చైర్మెన్‌ దినేష్‌ ఖారా లాంచనంగా ప్రారంభించారు. స్టార్టప్‌ల అన్ని రకాల అవసరాలను తీర్చేలా ఈ బ్రాంచీని రూపొందించామని దినేష్‌ ఖారా తెలిపారు. కొత్త శాఖా ఏర్పాటు సందర్భంగా స్టార్టప్‌ ఔత్సాహికవేత్తలతో ఏర్పాటుచేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోశిస్తున స్టార్టప్‌ల పట్ల తాము అంకితభావన్ని కలిగి ఉన్నామన్నారు. ఈ శాఖ స్టార్టప్‌ విత్త, విత్తయేతర అవసరాలను తీర్చనున్నాయని వెల్లడించారు. మరిన్ని యూనికర్న్‌ల వృద్ధికి మద్దతును అందించనుందన్నారు. ఈ సందర్బంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా నాలుగు సంస్థలకు రూ.50 లక్షల చొప్పున అందించారు.

Spread the love